ది లెజెండ్ హీరోయిన్ రెమ్యునరేషన్.. లైఫ్ టైమ్ సెటిల్మెంట్!


ఇటీవల పాన్ ఇండియా మూవీ అంటూ ఒక రిచ్ బిజినెస్ మెన్ సినిమా విడుదలైంది. తమిళనాడులో అత్యంత ధనవంతుల్లో ఒకరైన శరవణ స్టార్స్ అధినేత శరవణన్ నటించిన తొలి సినిమా ది లెజెండ్ తెలుగులో కూడా విడుదలైంది. ఇక ఈ సినిమాలో నటీనటులకు టెక్నీషియన్లకు ఊహించని రేంజ్ లోనే రెమ్యునరేషన్స్ ఇచ్చినట్లు టాక్.

ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా మేయిన్ హీరోయిన్ గా నటించగా ఈ బ్యూటీకి లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అనే తరహాలో రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమె ఇంతవరకు చూడనంత డబ్బును ఆఫర్ చేశారట. ప్రస్తుతం సౌత్ లో అత్యధికంగా రెమ్యునరేషన్ అందుకుంటున్న వారిలో నయనతార టాప్ లో ఉండగా సమంత సెకండ్ ప్లేస్ లో ఉంది. నయన్ 8కోట్లు డిమాండ్ చేస్తోంది. ఇక అంతకంటే ఎక్కువగా ది లెజెండ్ సినిమాకు ఊర్వశికి 15కోట్లు ఇచ్చినట్లు సమాచారం. ఆ సినిమా ట్రోలింగ్ కు గురైనప్పటికి డిజాస్టర్ అయినప్పటికీ ఊర్వశి మాత్రం మంచి ఆదాయాన్ని అందుకుంది.

Post a Comment

Previous Post Next Post