ఆగస్టు నెలలో సినిమాల హడావుడి కాస్త ఎక్కువగా కనిపించబోతోంది. ఆడియెన్స్ థియేటర్స్ కు ఎక్కువగా రావడం లేదనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్న సమయంలో ఒకేసారి 12 తెలుగు సినిమాలు భారీ స్థాయిలో విడుదల కాబోతున్నాయి. ఇక ఆగస్టు 5వ తేదీన రెండు విభిన్నమైన సినిమాలు రానున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, సీతారామం అలాగే కళ్యాణ్ రామ్ బాంబిసార భారీ స్థాయిలోనే రానున్నాయి.
ఇక ఆగస్టు 11వ తేదీన ఆమిర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చద్దా' తెలుగులో కూడా విడుదల కానుంది. అక్కినేని నాగచైతన్య ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. అలాగే నితిన్ 'మాచర్ల నోయోజికవర్గం' మరియు మోస్ట్ వాంటెడ్ మూవీ నిఖిల్ సిద్దార్థ్ నటించిన 'కార్తికేయ2' ఆగస్టు 12న రానుండగా బెల్లకొండ గణేష్ మొదటి సినిమా స్వాతిముత్యం ఆగస్టు 13న రిలీజ్ అవుతోంది. ఆగస్టు 25న బిగ్గెస్ట్ మూవీ లైగర్ రానుంది. ఇక ఆది సాయి కుమార్ తీస్ మార్ ఖాన్, పండుగాడు, మాటేరాని మౌనమిది, కమిట్మెంట్ అనే మరికొన్ని చిన్న సినిమాలు ఆగస్టు 19న రానున్నాయి. చివరలో సత్యం రాజేష్ కళాపురం మరో తమిళ్ డబ్ మూవీ పిశాచి 2 వచ్చే ఛాన్స్ ఉంది.
Follow
Post a Comment