లైగర్.. శ్రీదేవి కూతురు ఎందుకు చేయలేదంటే?


విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కలయికలో తెరపైకి రాబోతున్న మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ లైగర్ ఈనెల 25వ తేదీన గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ అయితే బాగానే చేస్తున్నారు. కానీ సినిమాకు ఇంకా అనుకున్నంత రేంజ్ లో అయితే బజ్ క్రియేట్ కాలేదు. ఇక రెగ్యులర్ ప్రమోషన్స్ లో సినిమాకు సంబంధించిన అనేక విషయాలను కూడా చెబుతున్నారు.

ఇక రీసెంట్ గా దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ సినిమాలో మొదట అనన్య పాండే కంటే ముందే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నట్లు తెలియజేశాడు. మొదట కరణ్ జోహార్ కు  కథను చెప్పినప్పుడు ఆ తర్వాత జాన్వీకపూర్ తో కూడా చర్చలో జరిపారట. కానీ అప్పటికే ఆమె మిగతా సినిమా షూటింగ్లతో చాలా బిజీగా ఉండడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో జాన్వీ లైగర్ సినిమాను చేయలేను అని చెప్పేసిందట. ఇక తర్వాత కరణ్ జోహార్ సలహా మేరకు అనన్య పాండేను తీసుకున్నట్లుగా పూరి జగన్నాథ్ తెలియజేశాడు.

Post a Comment

Previous Post Next Post