మహేష్, త్రివిక్రమ్.. హయ్యెస్ట్ బడ్జెట్!


దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో కొత్త ప్రాజెక్టును మరి కొన్ని రోజుల్లో స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ కూడా పూర్తయ్యాయి. ఇక రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి సినిమాను 2023 ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా బడ్జెట్ ఎంత అనే విషయంలో కొన్ని విషయాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.

ఒక విధంగా మహేష్ బాబు త్రివిక్రమ్ కెరీర్ లోనే ఈ సినిమాకు అత్యధిక బడ్జెట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. దాదాపు 200 కోట్ల వరకు నిర్మాత ఖర్చు పెట్టబోతున్నట్లు సమాచారం. అయితే ఇందులోనే ఇరువురి పారితోషికాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక విధంగా త్రివిక్రమ్ ఈ సినిమాకు పాట్నర్ గా కూడా ఉన్నాడు. మహేష్ బాబు కేవలం పారితోషికం తీసుకొని సైడ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక రాజమౌళి సినిమా కంటే ముందు మహేష్ తన కెరీర్లో ఒక బిగ్ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post