ఎవరు ఆపగలరో నేను చూస్తాను: విజయ్ దేవరకొండ


రౌడి స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లైగర్ ఆగస్టు 25న గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక కరణ్ జోహార్ ఎఫెక్ట్ తో హిందీలో ఎక్కువగా బాయ్‌కాట్ లైగర్ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ విషయంపై ఇదివరకే విజయ్ క్లారిటీ ఇచ్చారు. ఇక మరోసారి ప్రతిస్పందిస్తూ, విజయ్ దేవరకొండ ఆత్మవిశ్వాసాన్ని చూపించారు.


మాకు అందరి ఆశీస్సులు ఉన్నాయి. లైగర్ భారీగా ఉండబోతోంది. ఎవరు ఆపగలరో నేను చూస్తాను.  నాకు మా అమ్మ దీవెనలు అలాగే ప్రేక్షకుల మద్దతు ఉంది..అని విజయ్ రీసెంట్ మీడియా ఇంటరాక్షన్‌లో అన్నారు.  తాను వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నానను అంటూ అయినా కూడా లైగర్‌ను సాధ్యమైనంత ఉత్తమంగా ప్రమోట్ చేయడానికి ఇంకా సమయాన్ని వెచ్చిస్తున్నానని విజయ్ చెప్పాడు. ఇదివరకు చాలామంది బాయ్ కాట్ బ్యాచ్ విషయంలో కొంత భయపడుతూ మాట్లాడినప్పటికి విజయ్ మాత్రం చాలా ఓపెన్ గా కౌంటర్ ఇవ్వడం వైరల్ అవుతోంది. మరి సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post