పుష్ప సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సుకుమార్ ఇప్పుడు అగ్ర దర్శకుల్లో ఒకరిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన పారితోషికం కూడా అగ్ర దర్శకులలాగే భారీగా అందుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు రాజమౌళి సినిమా ప్రాఫిట్ లో లాభాలు అందుకుంటూ కొనసాగుతున్న విషయాన్ని తెలిసిందే. ఆయన దాదాపు 100 కోట్ల వరకు ఆదాయం అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
అయితే ఈ క్రమంలో పుష్ప సెకండ్ పార్ట్ కు వచ్చేసరికి దర్శకుడు సుకుమార్ 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్లుగా టాక్. ఇక ఇప్పుడు ఆయన మైత్రి మూవీ మేకర్స్ తో పాటు పుష్ప సెకండ్ పార్ట్ కు తన హోమ్ ప్రొడక్షన్స్ సుకుమార్ రైటింగ్స్ ను కూడా జత చేశాడు అంటే సినిమా సక్సెస్ అయితే మాత్రం ఆ ప్రాఫిట్ లో కూడా లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది. పుష్ప 2 బిజినెస్ దాదాపు 700 కోట్లకు పైగానే ఉండవచ్చు అని సమాచారం. ఇక కలెక్షన్స్ అయితే 1000 కోట్లు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. మరి ఇదే తరహాలో పుష్ప 2 సక్సెస్ అయితే మాత్రం సుకుమార్ దాదాపు రాజమౌళి స్థాయిని టచ్ చేయడం ఈజీ అని చెప్పవచ్చు.
Follow
Post a Comment