గాడ్ ఫాదర్.. ఆచార్య కంటే తక్కువే..


మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ఈ ఏడాది దసరా సమయానికి విడుదల చేయాలి అని చిత్ర యూనిట్ సభ్యులు ప్రణాళికలుగా చేస్తున్నారు. ఆచార్య సినిమాతో కెరీర్ లోనే అతి దారుణమైన డిజాస్టర్ ఎదుర్కొన్న మెగాస్టార్ ఈ సినిమాతో ఎలాగైనా మళ్ళీ ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నాడు. మలయాళం హిట్ మూవీ లూసిఫర్ కు ఈ సినిమా రీమేక్ గా వస్తోంది.

అయితే ఇప్పటివరకు ఈ సినిమాపై కిక్కిచ్చే రేంజ్ లో అయితే ఒక్క అప్డేట్ కూడా రాలేదు. కనీసం ఆచార్య సినిమా విడుదల కాక ముందు మెగా కాంబినేషన్ కాబట్టి కొంత హైప్ అయితే క్రియేట్ చేసింది. ఆ తర్వాత కంటెంట్ చప్పగా ఉండడంతో ఆడియన్స్ పెద్దగా ఫోకస్ చేయలేదు. ఇక ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా విడుదలకు ముందు కూడా ఎలాంటి హైప్ క్రియేట్ చేయడం లేదు. 

ఆ మధ్య విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా ఏమంతగా వర్కౌట్ కాలేదు. నిన్ననే మెగా బర్త్ డే కానుకగా టీజర్ కూడా వరదలబోతున్నట్లు తెలియజేశారు. కానీ ఆ వాతావరణం హడావిడి కనిపించడం లేదు. ఇందులో సల్మాన్ ఖాన్ ఒక స్పెషల్ పాత్రలో కనిపిస్తున్నాడు అని చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం ఆ సైడ్ లో కూడా బజ్ క్రియేట్ ఇవ్వడం లేదు. మరి టీజర్ ద్వారా ఏమైనా అంచనాలు క్రియేట్ చేస్తారో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post