ఒక సినిమా సక్సెస్ అయ్యే వరకు కూడా దర్శకుడి స్థాయిలో మార్పులు రావు అనే చెప్పాలి. డిజాస్టర్ వస్తే కనీసం పలకరించే వాళ్ళు కూడా ఉండరు. ఇక మొత్తానికి పడి పడి లేచే సినిమాతో కింద పడిపోయినా హను రాఘవపూడి అనంతరం సీతారామం సినిమాతో మళ్ళీ పైకి లేచాడు. ఈ సినిమా తర్వాత అతని భవిష్యత్తు హీరో ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారింది.
ఎందుకంటే ఇంతకుముందు అతను చాలామంది హీరోలకు కథలు చెప్పాడు. కానీ వరుసగా 'లై' 'పడి పడి లేచే మనసు' డిజాస్టర్ కావడం వలన ఎవరు అవకాశం ఇవ్వలేదు. సీతారామం కథను వైజయంతిలో తీస్తున్నాము అని చెప్పినప్పటికీ కూడా నాని, నాగచైతన్య, రామ్ పోతినేని ఎవరు కూడా ఒప్పుకోలేదు.
ఇక ఇప్పుడు సక్సెస్ అందుకోవడంతో ఓవర్గం హీరోల ఫోకస్ ఇతనిపై పడింది. మరోసారి నానితో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సీతారామం ఇంటర్వ్యూలోనే నానితో చేయాల్సిన ఒక కథ ఉంది అని అది అతను చేస్తేనే బాగుంటుంది అని కూడా ఈ దర్శకుడు తెలియజేశాడు. మరి చెప్పినట్లే హను నానితో మరో సినిమాను తెరపైకి తీసుకు వస్తాడో లేదో చూడాలి.
Follow
Follow
Post a Comment