రాధేశ్యామ్, సీతారామం.. బడ్జెట్ కాదు కంటెంట్ ముఖ్యం!


సీతారామం సినిమా ప్రస్తుతం మంచి టాక్ తో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే విధంగా ముందుకు సాగుతోంది. దర్శకుడు హాను రాఘవపూడి మేకింగ్ కు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. అయితే ఈ సినిమా సక్సెస్ కావడంతో ప్రభాస్ అభిమానులు రాధే శ్యామ్ మేకర్స్ పై విమర్శలు చేస్తున్నారు. 300 కోట్ల బడ్జెట్ పెట్టడం కాదు కంటెంట్ ఎలా ఉండాలో సీతారామం సినిమాను చూసి నేర్చుకోవాలి అని యూవి క్రియేషన్స్ కు చెబుతున్నారు.

రాధే శ్యామ్ సినిమాకు గ్రాండ్ గా చూపించాలి అని కంటెంట్ సరిగ్గా లేకపోయినా భారీగా సెట్స్ వేసి వివిధ రకాల మ్యూజిక్ డైరెక్టర్స్ లను మార్చేశారు. ఏదో కళాకాండం తీశాము అన్నట్లుగా ప్రమోషన్స్ లో హడావుడి గట్టిగానే చేశారు. తీరా చూస్తే దీనికా ఇంత బిల్డప్ ఇచ్చింది అని ఆడియెన్స్ మామూలు ఆవేశాన్ని చూపించలేదు.  ఇక సీతారామం సినిమాకు అవసరం అయినంత కంటెంట్ కు తగ్గట్టుగా 35 కోట్ల లోపే ఖర్చు చేసి వైజయంతి మూవీస్ మంచి అవుట్ పూట్ అందించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రెండు సినిమాలను పోలుస్తూ కొన్ని మీమ్స్ వైరల్ చేస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post