కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకుంటుంది. దర్శకుడు వశిష్ట మొదటి సినిమా అయినప్పటికీ కూడా ఈ ఫాంటసీ కథను అద్భుతంగా తెరపైకి తీసుకురావడం ప్రశంసించాల్సిన విషయం అనే చెప్పాలి. మాస్ కమర్షియల్ ఆడియన్స్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకు బాగానే కనెక్ట్ అవుతున్నారు.
అయితే ఈ సినిమా కథ ఇంతకుముందు కొంతమంది హీరోలకు చెప్పడం జరిగింది. దర్శకుడు వశిష్టకు ఎప్పటినుంచో మంచి పరిచయమున్న హీరోలలో రవితేజ ఒకరు. అయితే రవితేజ ఈ సినిమా కథ విన్నప్పుడు కొన్ని రోజులపాటు చర్చలు జరిపాడట. కానీ ఫాంటసీ కథను కొత్త దర్శకుడు ఎలా బ్యాలెన్స్ చేస్తాడో అని కాస్త అనుమానంతో ధైర్యం చేయలేకపోయాడట. ఇక తర్వాత కళ్యాణ్ రామ్ ఆ స్టోరీ లైన్ గురించి తెలుసుకొని చాలా మార్పులు చేయించాడు. అంతేకాకుండా కళ్యాణ్ రామ్ కు సొంతంగా గ్రాఫిక్స్ స్టూడియో ఉండడంతో ఈ సినిమాకు అది చాలా బాగా హెల్ప్ అయ్యింది. ఇక బింబిసారా సీక్వెల్ ను ఇంకా ఎలా ప్రజెంట్ చేస్తారో చూడాలి.
Follow
Post a Comment