ఎన్టీఆర్ ఫ్యామిలీలో విషాదం


నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ ఎన్టీఆర్ చిన్న కుమార్తె కుమార్తె కంఠ‌మనేని ఉమామహేశ్వరి కన్నుమూశారు. జూబ్లీహిల్స్ లోని తన స్వగృహంలోనే ఆమె కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఆమె తన చిన్న కుమార్తె వివాహం కూడా చేశారు. ఆ వేడుకలో నందమూరి కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు.

ఇక ఇంతలోనే హఠాత్తుగా ఉమామహేశ్వరి మరణించడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక ఈ వార్త గురించి తెలియగనే నందమూరి కుటుంబ సభ్యులు అందరూ కూడా హుటాహుటిన ఉమామహేశ్వరి స్వగృహనికి చేరుకున్నారు. ఎన్టీఆర్ కు మొత్తం ఎనిమిది మంది కుమారులు, నలుగురు కుమార్తెలు. ఇక చిన్న తనంలోనే పెద్ద కుమారుడు రామకృష్ణ మృతి చెందారు. ఇక ఇప్పుడు ఆయన చిన్న కుమార్తె మృతి చెందడంతో నందమూరి ఫ్యామిలీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Post a Comment

Previous Post Next Post