శంకర్ మరో వెయ్యి కోట్ల ప్లాన్?


తమిళ దర్శకుడు శంకరు ఎలాంటి కథ తెరపైకి తీసుకువచ్చిన కూడా చాలా గ్రాండ్ గా ప్రజెంట్ చేయాలని అనుకుంటాడు. ఇక ప్రస్తుతం అతను రామ్ చరణ్ తో చేస్తున్న ప్రాజెక్టు కూడా భారీ అంచనాలతోనే తెరపైకి రాబోతోంది. అయితే శంకర్, రామ్ చరణ్ 15వ సినిమా తర్వాత ఇండియన్ 2 ప్రాజెక్టును ఫినిష్ చేయనున్నాడు.

అలాగే బాలీవుడ్ లో రణవీర్ సింగ్ తో అపరిచితుడు 2 కూడా స్టార్ట్ చేయబోతున్నాడు. అలాగే శంకర్ ప్లానింగ్ లో ఒక 1000 కోట్ల ప్రాజెక్టు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఇద్దరు స్టార్ హీరోలు అవసరం అవుతారట. ఇప్పటికే బాలీవుడ్లో హృతిక్ రోషన్ తో ఒకసారి చర్చలు కూడా జరిపైనట్లు సమాచారం. ఆ సినిమా కథ అండర్ వాటర్ సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందంట. ఇక తెలుగు ఇండస్ట్రీ నుంచి మరొక అగ్ర హీరోను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రాంచరణ్ అనే ఒక టాక్ వినిపిస్తోంది గాని ఇంకా శంకర్ అయితే పూర్తి స్థాయిలో ఈ కథను ఎవరికి చెప్పలేదని తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్టును అతను ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి.

Post a Comment

Previous Post Next Post