దుల్కర్ కోసం వస్తున్న ప్రభాస్!


దుల్కర్ సల్మాన్ నటించిన సీతా రామం ఆగస్టు 5న తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో విడుదల కానుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రత్యేకమైన కథనం, ఆకట్టుకునే ట్రైలర్,  పాటలు అలాగే మేకర్స్ ట్రాక్ రికార్డ్ ఇలా అన్ని రకాల అంశాలు హైలెట్ అవుతున్నాయి.

వైజయంతి బ్రాండ్ ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. చిత్ర యూనిట్ ఇప్పటి వరకు చేసిన ప్రమోషన్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను మరింత ప్రత్యేకంగా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభాస్ రానున్నాడు. రాధే శ్యామ్ అనంతరం ఇంతవరకు మీడియా ముందుకు రాని ప్రభాస్ ఈ సినిమా కోసం స్పెషల్ గా దర్శనమివ్వబోతున్నాడు. వైజయంతి మూవీస్ లోనే ప్రభాస్ ప్రాజెక్ట్ K సినిమా చేస్తున్నాడు. ఇక ఆ అనుబధంతో సి.అశ్వినీదత్ ప్రత్యేకంగా ఆహ్వానించారట. మరి ప్రభాస్ ఎలాంటి లుక్ లో కనిపిస్తాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post