మహేష్ బాబు ఒక స్టార్ హీరోగా మాత్రమే కాకుండా బిజినెస్ వ్యవహారాల్లో కూడా చాలా తెలివిగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పటికే ఏషియన్ గ్రూప్, AMB సినిమాస్‌తో థియేటర్ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్న మహేష్ త్వరలోనే రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాడు. అయితే మహేష్ నేరుగా రెస్టారెంట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం లేదని సమాచారం.
కానీ అతను రెస్టారెంట్‌కు వచ్చే లాభాల్లో మాత్రం ప్రాఫిట్ అందుకుంటాడు. లేటెస్ట్ టాక్ ప్రకారం.. బంజారాహిల్స్ లో మహేష్ కు ఒక ఖరీదైన ల్యాండ్ ఉంది. ఇక ప్రముఖ రెస్టారెంట్ సంస్ధ ఫోకస్ ఆ ల్యాండ్ పై పడింది. ఇక మహేష్ కు రెస్టారెంట్ యొక్క కాన్సెప్ట్ ఆలోచన నచ్చడంతో ల్యాండ్ ను అందించి పాట్నార్ గా మారిపోయాడట. అలాగని పాట్నార్ గా పెట్టుబడులు పెట్టకుండా కేవలం ప్రాఫిట్స్ లో లాభాలు వచ్చే వ్యూహాత్మక ధోరణిలో ఆలోచించినట్లు సమాచారం. ఇక మహేష్ తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టార్ట్ చేయనున్న విషయం తెలిసిందే.
Follow
Post a Comment