పోకిరి స్పెషల్ షోస్ కలెక్షన్స్.... DVSK రీ రిలీజ్ రికార్డ్ బ్రేక్!


మహేష్ బాబు పోకిరి సినిమాను ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ షోస వేసిన విషయం తెలిసిందే. మొదట ఏదో రెండు మూడు షోలు వేయాలని అనుకున్నారు. కానీ ఫ్యాన్స్ నుంచి డిమాండ్ ఎక్కువగా రావడంతో 380 కి పైగా షోలు వేయాల్సి వచ్చింది. ఓవర్సీస్ లో కూడా డిమాండ్ ను బట్టి రిలీజ్ చేశారు.

ఇక పోకిరి సినిమా థియేటర్లు చాలా వరకు హౌస్ ఫుల్ అయ్యాయి. పోకిరి స్పెషల్ షోస్ నుండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సుమారుగా 1.56 కోట్లు రాబట్టింది. రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో కలుపుకొని 1.73 కోట్ల గ్రాస్ వచ్చింది. గతంలో ఎన్టీఆర్ ధనవీన శూరకర్ణ DVSK (1977) సినిమాను 1994లో భారీ ఎత్తున రీ రిలీజ్ చేశారు.  17 ఏళ్ళ తర్వాత విడుదలైన ఆ పాత చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్లు 60 లక్షలకు కొనుగోలు చేయగా కోటి రూపాయలకు పైగా అందుకుంది. ఒక విధంగా పోకిరి కూడా కేవలం స్పెషల్ షోస్ తోనే ట్రెండ్ సెట్ చేసింది.

Post a Comment

Previous Post Next Post