కథ:
బాలా మణి (రమ్యకృష్ణ) తన కొడుకు లైగర్ ను (విజయ్ దేవరకొండ) మార్షల్ ఆర్ట్స్‌లో నేషనల్ ఛాంపియన్‌గా నిలవాలని కోరుకుంటుంది. అందుకోసం తల్లీ కొడుకులు ముంబైకి వెళతారు. లైగర్ ఆ తరువాత ఒక రిచ్ గర్ల్ తానియా (అనన్య పాండే)తో ప్రేమలో పడతాడు. అనంతరం లైగర్ చాంపియన్ కోసం తీవ్రంగా కష్టపడుతూ ఉండగా మధ్యలో లవ్ స్టొరీ కారణంగా అతను డైవర్ట్ అవుతుంటాడు. ఇక ఆ తరువాత హీరోయిన్ ప్రేమ ఎక్కడి వరకు వెళ్లింది. ఇక లాస్ వెగాస్‌లో జరిగిన ప్రపంచ MMA ఛాంపియన్‌షిప్ కు వెళ్లిన విజయ్ అక్కడ విజేతగా నిలిచాడా? చివరకు USAలోని కిడ్నాప్ సంఘటన ఎలాంటి మలుపు తిప్పింది? మైక్ టైసన్ తో లైగర్ కు ఉన్న సంబంధం ఏమిటి అనేది వెండితెరపై చూడాలి.
విశ్లేషణ:
దర్శకుడు పూరి జగన్నాథ్ ఇన్నేళ్ల కెరీర్ లో చాలా ఎక్కువ టైమ్ తీసుకొని సెట్ చేసుకున్న ప్రాజెక్ట్ లైగర్. ఇక ఈ సినిమా కోసం విజయ్ పడిన కష్టం గురించి పోస్టర్ లోనే అర్ధమయ్యింది. ఇక సినిమా ఎలా ఉంది అనే విషయంలోకి వెళితే కథ విషయంలో ఆశ్చర్యపరిచేంత హైలెట్ పాయింట్స్ ఏమి లేవు. ఒక విధంగా అమ్మా నాన్న తమిళ అమ్మాయి అప్డేటెడ్ వెర్షన్ అని చెప్పవచ్చు. కథకు మాస్ టచ్ మదర్ సెంటిమెంట్ ను జత చేస్తూ MMA బ్యాక్ డ్రాప్ యాక్షన్ తో ట్విస్ట్ ఇవ్వాలని పూరి అనుకున్నాడు. ఇక క్లయిమ్యాక్స్ లో మైక్ టైసన్ తో మరో లెవెల్ కు తీసుకు వెళ్లాలని అనుకున్నారు. కానీ వెండితెరపై ఊహించిన దానికి భిన్నంగా ఉంది.
దర్శకుడు పూరి రొటీన్ స్క్రీన్ ప్లే తో చాలా వరకు నీరసంగా కొనసాగించాడు. ఆడియెన్స్ ప్రతీ సన్నివేశాన్ని ముందే ఊహిస్తారు. ఇక ముఖ్యంగా పూరి మార్క్ డైలాగ్స్ ఈ సినిమాలో కొంత కూడా లేకపోవడం మరో షాకింగ్ విషయం. ఇక MMA ఫైట్స్ ఇంటర్వెల్ యాక్షన్ సీన్స్ పరమ రొటీన్ రోత అనే తరహాలోనే ఉంది. చెప్పుకోదగ్గ విషయాల్లో మాత్రం విజయ్ దేవరకొండ మెకోవర్ అద్భుతం. అతని బాడీ లాంగ్వేజ్ తోనే కొన్ని సీన్స్ ను మరో లెవెల్ కు తీసుకు వెళ్ళాడు. అలాగే ఇక సినిమాలో సాంగ్స్ ఎందుకు పెట్టారు అనేది మరో మిస్టరీ. హీరోయిన్ అనన్య పాండే క్యారెక్టర్ అనవసరంగా ఉందని అనిపిస్తుంది. సునీల్ కశ్యప్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి కొంత ఊరటనిచ్చే అంశం. కానీ పాటల కోసం అనవసరంగా విభిన్నమైన కంపోజర్స్ ను తీసుకొచ్చి మొత్తం చెడగొట్టేశారు.
విజయ్ దేవరకొండ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఇందులో మేయిన్ హైలెట్ గా చెప్పుకోవచ్చు. ఇక అతను నత్థిలో తన పాత్రకు న్యాయం చేశాడు. అన్ని సన్నివేశాల్లో విజయ్ పెర్ఫెమెన్స్ బాగుంది కానీ అనన్య పాండే తో లవ్ సీన్స్ మాత్రం చాలా రొటీన్ గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ ఏదో అలా ఫినిష్ అయితే సెకండ్ హాఫ్ మాత్రం మరింత రొటీన్ గా ఉంది. లైగర్ నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ చాంపియన్ వరకు వెళ్లిన విధానంతో సెకండ్ హాఫ్ క్లయిమ్యాక్స్ వరకు చేరుకంటుంది. ఇక రియల్ బాక్సర్ మైక్ టైసన్ క్యారెక్టర్ ఏమాత్రం పవర్ఫుల్ గా లేదు. యూఎస్ బ్యాక్ డ్రాప్ లో డబ్బు అనవసరంగా వృధా చేశారు అని చెప్పవచ్చు. క్లయిమ్యాక్స్ ఎంతో సీరియస్ నోట్ తో ఉంటుందని అనుకుంటే అసలు ఆ రేంజ్ లో మెప్పించలేదు. చివరకు అందరూ ఊహించిందే లైగర్, మైక్ టైసన్ క్యారెక్టర్ కు కనెక్షన్ ఉంటుంది. ఆ తరువాత పూరి స్టైల్ రొటీన్ ఎండింగ్. సినిమాలో మొత్తంగా విజయ్ నటన బాగుంది. ఫస్ట్ హాఫ్ లో రమ్యకృష్ణ పాత్ర బాగుంది కానీ సెకండ్ హాఫ్ లో అనవసరమైన ఓవర్ సీన్స్ మళ్ళీ ఆమె క్యారెక్టర్ ను డౌన్ అయ్యేలా చేశాయి. ఇక హీరోయిన్ క్యారెక్టర్ అనవసరం.. మిగతా కొన్ని మేజర్ క్యారెక్టర్స్ కూడా అంతంత మాత్రంగానే మెప్పించాయి.
ప్లస్ పాయింట్స్:
👉విజయ్ దేవరకొండ
👉ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్
మైనస్ పాయింట్స్
👉సాంగ్స్
👉లవ్ ట్రాక్
👉రొటీన్ స్క్రీన్ ప్లే
👉క్లయిమ్యాక్స్
రేటింగ్: 2/5
Follow
Follow
Post a Comment