లైగర్ హైప్ కోసమే.. జనగణమన?


మొత్తానికి లైగ ర్ సినిమా రిజల్ట్ ఏమిటి అనేది తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది అని మొదటి షోకే అర్థమయిపోయింది. దాదాపు అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా సినిమాపై తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు. విజయ్ దేవరకొండ కంటే పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ ఈ సినిమాపై ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారు. సినిమాలో కనీసం ఒక్క పవర్ఫుల్ డైలాగ్ కూడా లేకపోవడం పెద్ద మిస్టరీ అని అంటున్నారు.

ఇక ఆ సంగతి పక్కన పెడితే విజయ్ దేవరకొండ లైగ ర్ సినిమా మీద హై క్రియేట్ చేయడానికి జనగణమన సినిమా లాంచ్ అనే హడావిడి చేసినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే జనగణమన అనేది పూరి జగన్నాథ్ కెరీర్ లోనే ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అని ఆడియన్స్ అందరికీ కూడా తెలుసు. గతంలో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు వంటి పెద్ద హీరోలతో చేద్దామనుకొని అలానే ఆగిపోయిన ఆ సినిమాను విజయ్ దేవరకొండ చేస్తున్నాడు అంటే ఒక ఆసక్తి క్రియేట్ అయింది. 

ఇక లైగ ర్ సినిమా చాలా పవర్ ఫుల్ గా వచ్చింది కాబట్టే విజయ్ జనగణమణ చేసేందుకు ఒప్పుకున్నాడు అని జనాల్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేయడానికి ప్లాన్ అయ్యే ఉండవచ్చు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఏదేమైనా కూడా లైగర్ సినిమా కోసం విజయ్ చాలా హార్డ్ వర్క్ చేశాడు. పూరి జగన్నాథ్ మేకింగ్ పై నమ్మకంతోనే పూరి సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు కానీ ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. జనాలు మళ్ళీ వీరి కాంబోలో వచ్చే జనగణమన సినిమాను నమ్మాలి అంటే చాలా మ్యాజిక్ జరగాల్సి ఉంటుంది. మరి జనగణమన ఊహించినట్లే పై పై హడావిడినా లేకపోతే కాంటిన్యూ అవుతుందా అనేది చూడాలి.

Post a Comment

Previous Post Next Post