పుష్ప2.. ఐటెమ్ సాంగ్ కోసం చందమామ?


ఇటీవల కాలంలో బాగా ట్రెండ్ అయిన ఐటమ్స్ సాంగ్స్ లలో పుష్ప 'ఉ అంటావా' సాంగ్ ఏ రేంజ్ లో క్లిక్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. దాదాపు అన్ని భాషల్లో క్రేజ్ అందుకున్న పుష్ప ఐటెమ్ సాంగ్ సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఇక సమంతకు కూడా మంచి గుర్తింపు లభించింది. అయితే సెకండ్ పార్ట్ లో ఎవరితో ఐటెమ్ సాంగ్ చేయిస్తారు అనేది గత కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారింది. 

ఈ క్రమంలో ప్రస్తుతం టాలీవుడ్ చందమామ కాజల్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. పుష్ప 2 ఐటెమ్ సాంగ్ లిరిక్స్ కూడా దాదాపు ఉ అంటావా.. అనే తరహాలోనే ఉంటాయట. ఐటెమ్ సాంగ్ ను కూడా సెకండ్ పార్ట్ అన్నట్లుగా కంటిన్యూ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి కాజల్ అగర్వాల్ ఏ స్థాయిలో క్రేజ్ అందుకుంటుందో చూడాలి. ప్రస్తుతం కాజల్ ఇండియన్ 2తో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులతో బిజీ కాబోతోంది. ఇక పుష్ప 2ను వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం విడుదల చేయనున్నారు.

Post a Comment

Previous Post Next Post