థమన్ SSMB28 రెమ్యునరేషన్ ఎంతంటే!


టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న థమన్ తన కెరీర్ లో మరో బిగ్ బడ్జెట్ సినిమాకు వర్క్ చేయబోతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న మహేష్ బాబు SSMB 28 సినిమా త్రివిక్రమ్ మహేష్ లకు కూడా చాలా పెద్దది. ఇక ఈ సినిమాకి వర్క్ చేస్తున్న మేజర్ టెక్నీషియన్స్ మేయిన్ స్టార్స్ అందరూ కూడా టాప్ రెమ్యునరేషన్స్ అందుకుంటున్నారు.

ఇక థమన్ కూడా హై రేంజ్ లోనే రెమ్యునరేషన్ దక్కించుకుంటున్నాడు. మొన్నటివరకు అతను సినిమా రేంజ్ ను బట్టి అత్యధికంగా 3 కోట్లు అతి తక్కువగా కోటిన్నర వరకు పారితోషికం అందుకుంటూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు మహేష్ సినిమా కోసం గతంలోనే ఎప్పుడు లేని విధంగా 5 కోట్ల వరకు అందుకోబోతున్నాడు. ఈ కాంబో ఆడియె రైట్స్ కు డిమాండ్ గట్టిగానే ఉంది. ఇక థమన్ అందులో వాటా అందుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

Post a Comment

Previous Post Next Post