హిందీ సినిమాకు ఎడిటర్ గా రాజమౌళి


దర్శకధీరుడు రాజమౌళి RRR సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు మహేష్ బాబు సినిమా కోసం వర్క్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ పనులు కాస్త నెమ్మదిగానే కొనసాగుతున్నాయి. అయితే మరోవైపు రాజమౌళి ఒక సినిమా కోసం ఎడిటింగ్ వర్క్ కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే పూర్తిస్థాయిలో కాకుండా కేవలం తన సజెషన్స్ ఇస్తున్నట్లు సమాచారం  ఆ సినిమా మరేదో కాదు బ్రహ్మాస్త్ర.

బ్రహ్మాస్త్ర మొదటి భాగం సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల కాబోతోంది.  అత్యంత భారీగా పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని మళ్లీ బాలీవుడ్ ట్రాక్ లోకి రావాలి అని చాలామంది బాలీవుడ్ ప్రముఖులు కోరుకుంటున్నారు. అయితే ఈ సినిమా కు తెలుగులో రాజమౌళి సమర్పకుడిగా ఉన్న విషయం తెలిసిందే. 

ఇక ఆయన బ్రాండ్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఇప్పటికే కొన్నిసార్లు సినిమాను ప్రత్యేకంగా వీక్షించిన జక్కన్న డైరెక్టర్ ఆయాన్ ముఖర్జీకి సెకండడ్ హాఫ్ లో కొన్ని సీన్లు ఎడిట్ చేయమని తనదైన శైలిలో సలహాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయాన్ కూడా పెద్దగా ఆలోచించకుండా కొన్ని సన్నివేశాలను తొలగించినట్లు సమాచారం. మరి జక్కన్న ఎడిటింగ్ ఆలోచన సినిమాకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post