బిగ్ బాస్ విన్నర్ తో సన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్!


సన్నాఫ్ ఇండియా సినిమాతో ఊహించని విధంగా డిజాస్టర్ అందుకున్న ప్రముఖ రైటర్ రత్నబాబు ఇప్పుడు మరో సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. పలు కామెడీ సినిమాలకు రచయితగా వర్క్ చేసిన రత్నబాబు ఎక్కువగా మంచు కాంపౌండ్ లోనే ఇన్ని రోజులు సినిమాలు చేసుకుంటే వచ్చారు.

ఇక ఇప్పుడు బిగ్ బాస్ 5 విన్నర్ విజే సన్నీ అలాగే సప్తగిరి ప్రధాన పాత్రలో ఒక సినిమా తెరపైకి తీసుకురాబోతున్నాడు. ఇటీవల వినాయక చవితి సందర్భంగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇక ఈ సినిమాకు నో డౌట్ 100% పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ అనే ట్యాగ్ కూడా ఇచ్చారు. ఇంతకుముందు కూడా సన్నాఫ్ ఇండియా సినిమాకు ఇంతకంటే ఎక్కువ కన్ఫిడెంట్ తో వచ్చిన ఈ దర్శకుడు ఎలాంటి ఫలితాన్ని అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి ఈసారైనా బిగ్ బాస్ విన్నర్ ద్వారా సక్సెస్ అవుతాడో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post