మహేష్ సినిమాపై రాజమౌళి క్లారిటీ.. జానర్ ఇదే!


ఎస్ఎస్.రాజమౌళి RRR సినిమాతో గుర్తింపు పొందిన తర్వాత టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో పాల్గొన్నారు. అయితే అక్కడ తన ఇంటరాక్షన్ సందర్భంగా రాజమౌళి తన తదుపరి చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబును డైరెక్ట్ చేస్తానని షూట్ వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది అని వెల్లడించారు. ఇక ఈ సినిమా ‘గ్లోబ్‌ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్’ అని రాజమౌళి వెల్లడించారు. 

అంటే ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రయాణించే ఒక హీరో కథ అని తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఈ చిత్రం గురించి చాలా పుకార్లు వైరల్ అవుతుండగా మొత్తానికి రాజమౌళి ఈ చిత్రం యొక్క జానర్‌ను ధృవీకరించారు.  ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని చిత్రీకరించనున్నట్టు సమాచారం.  ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. ఇక వచ్చే ఏడాది మేలో రెగ్యులర్ షూట్ మొదలుపెట్టనున్నారు. ఈ సినిమా కోసం రాజమౌళి రెండు నెలల వర్క్ షాప్ కూడా నిర్వహించనున్నారు. కెఎల్ నారాయణ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనుండగా ఎమ్ఎమ్.కీరవాణి మ్యూజిక్ అందించబోతున్నారు.

Post a Comment

Previous Post Next Post