కృష్ణంరాజుకు తలకొరివి పెట్టింది ఎవరంటే?


ప్రముఖ నటుడు కృష్ణంరాజు అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి.  సినీ రంగానికి, రాజకీయ రంగానికి కృష్ణంరాజు చేసిన సేవలకు గాను తెలంగాణ 
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు.  ప్రభాస్ అన్నయ్య ప్రభోద్ అంత్యక్రియలు నిర్వహించారు.  మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలోని కృష్ణంరాజు ఫాంహౌస్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.

వందలాది మంది రెబల్ స్టార్ అభిమానులు ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు, అయితే భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు కృష్ణంరాజు కుటుంబ సభ్యులను స్నేహితులను మాత్రమే ఫామ్‌హౌస్‌లోకి అనుమతించారు. తొలుత కృష్ణంరాజు కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో దహన సంస్కారాలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. కానీ కృష్ణంరాజు తన చివరి దశను ఫామ్ హౌస్ లోనే గడపాలని అనుకున్నారు. అందుకే కుటుంబ సభ్యులు అక్కడ ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు.

Post a Comment

Previous Post Next Post