కృష్ణ వ్రింద విహారి - మూవీ రివ్యూ


కథ:
కృష్ణ చారి(నాగ శౌర్య) ఒక ఐటీ కంపెనీలో టెక్నికల్ ట్రైనర్‌గా జాబ్ చేస్తుంటాడు. అనంతరం నార్త్ ఇండియన్ అమ్మాయి అయిన వృందా (షిర్లీ) అనే మేనేజర్‌తో ప్రేమలో పడతాడు. షిర్లీకి ఉన్న విచిత్రమైన ఒక మెడికల్ సమస్య గురించి కృష్ణ తన తల్లిదండ్రులకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటాడు. అనంతరం కృష్ణ తల్లికి వృందా వ్యవహారాలు ఇతరులతో సోషల్ గా కొనసాగడం నచ్చదు.  ఇక ఆ తరువాత వృందా అలాగే కృష్ణ పేరెంట్స్ మధ్య జరిగే గొడవేంటి వాటిని కృష్ణ ఎలా హ్యాండిల్ చేశాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ:
యువ దర్శకుడు అనీష్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కథను పెద్దగా కన్ఫ్యూజన్ లేకుండా రాసుకున్నాడు. ఇక కథనంలో అతను కామెడీ ప్లస్ ఫ్యామిలీ కి సంబంధించిన సరదా సన్నివేశాలను కొనసాగించాడు.  IT ఆఫీస్ సెటప్, హీరో బ్యాక్‌డ్రాప్ అలాగే సపోర్టింగ్ కాస్ట్ అన్నీ కూడా ఎంటర్టైన్ చేసేలా సెట్ చేసుకున్న విధానం బాగానే ఉంది. ఇక ఫస్ట్ హాఫ్ లో ఫ్లాట్ గా ఉన్న భవన కలుగుతుంది. ముఖ్యంగా హీరో ఆఫీస్ లో ఉన్నప్పుడు ఆ తరువాత హీరోయిన్ ని కలుసుకునే విధానం కూడా కాస్త రొటీన్ గా అనిపిస్తుంది.

ఫస్ట్ హాఫ్ నీరసంగా కొనసాగినా కూడా సెకండ్ హాఫ్ లో దర్శకుడు పరవాలేదు అనే విధంగా కొన్ని ఫ్యామిలీ సీన్స్ తో స్క్రీన్ ప్లే ను డిఫరెంట్ గానే ప్రజెంట్ చేశాడు. అత్త కోడళ్ల మధ్య ఉండే సీరియల్ ఐడియాను సినిమాటిక్ రేంజ్ కు సెట్ చేయడం మరో మేజర్ ప్లస్ పాయింట్. ఇది ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చకుండా ఉండదు. కానీ చివర ముగింపు లో మాత్రం దర్శకుడు కాస్త నిరాశపరిచాడు. సెకండ్ హాఫ్ సరదా సన్నివేశాలతో మెరుగ్గా లోడ్ చేయబడింది.  

క్లైమాక్స్‌లో కథనం ఫ్లాట్‌గా పడిపోతుంది కానీ మొత్తంమీద, కృష్ణ బృందా విహారి అయితే అంత బ్యాడ్ చిత్రమేమి కాదు. మంచి నటీనటులు ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ తల్లి పాత్రకు బాగానే సెట్ అయ్యింది. ఇక కొత్త హీరోయిన్ షెర్లీ పాత్రకు సరిపోతుంది. నాగశౌర్య  ఎప్పటిలాగే క్లాసీ కాస్ట్యూమ్స్‌తో గ్లామర్‌గా కనిపిస్తున్నాడు.  ఇక మరో మూడు పాటలు తెరపై చూడదగినవి.  సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ అద్భుతమైన పాటలను అందించారు.
పెద్దగా అంచనాలు లేకుండా కూల్ గా ఫ్యామిలీ ఆడియెన్స్ తో ఈ సినిమాను ఎంజాయ్ చేయవచ్చు.

ప్లస్ పాయింట్స్..
👉కుటుంబ కథాంశం
👉కొన్ని కామెడీ సన్నివేశాలు
👉క్యారెక్టర్స్

మైనస్ పాయింట్స్
👉క్లైమాక్స్
👉ఫస్ట్ హాఫ్ 

రేటింగ్: 2.50/5

Post a Comment

Previous Post Next Post