Review @ Aa Ammayi Gurinchi Meeku Cheppali


కథ:
‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా కథ చిత్ర పరిశ్రమ నేపథ్యంలో సాగే కల్పిత కథ. నవీన్ (సుధీర్ బాబు)  బ్యాక్ టు బ్యాక్ విజయవంతమైన చిత్రాలతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా క్రేజ్ అందుకుంటాడు. అయితే తన తదుపరి సినిమాలో కథానాయికగా నటించడానికి డాక్టర్ అయిన అలేఖ్యను కాలుస్తాడు. అయితే మొదట ఒప్పుకున్న అలేఖ్య తన బ్యాక్‌స్టోరీని బయటపెట్టింది. అనంతరం ఆమె కుటుంబం సినిమా ఫీల్డ్ ను ద్వేషిస్తారు? దీంతో ఆమె ఒప్పుకోదు. ఇక ఆ పరిస్థితులలో ఆలేఖ్య ను నవీన్ ఎలా ఒప్పించాడు? తల్లిదండ్రుల స్పందన ఏమిటి? అనే అంశాలు వెండితెరపై చూడాలి.

విశ్లేషణ:
దర్శకుడిగా నవీన్ పాత్రలో సుధీర్ బాబు బాగానే చేసాడు.  కాస్త అభిరుచి, కాస్త యాటిట్యూడ్ ఉన్న యువ దర్శకుడిలా కనిపించాల్సి వచ్చింది. కృతి శెట్టికి ఈసారి మరింత పరిణతి చెందిన పాత్రలో దర్శనమిచ్చింది. ఆమె తనవంతుగా సినిమాలో డీసెంట్ గా చేసింది. అయితే కథాంశంలో మాత్రం పెద్దగా ఆశ్చర్య పరిచే అంశాలు ఏమి లేవు. దర్శకుడు సీన్స్ తోనే ఎమోషన్స్ ని హైలెట్ చేయాలి అనుకున్నాడు.

దర్శకుడు మోహన్ కృష్ణ ఇదివరకే సమ్మోహనం సినిమాను సినిమా బ్యాక్ డ్రాప్ లోనే తెరపైకి తీసుకు వచ్చాడు. అయితే అందులో ఉన్నంత లవ్ ట్రాక్ ఎపిసోడ్స్ ఇందులో అంతగా క్లిక్ అవ్వలేదు. ఒక స్పెషల్ అమ్మాయితో సినిమా తీయాలనే అభిరుచి ఉన్న దర్శకుడి దృఢ నిశ్చయమే ఈ సినిమా మేయిన్ పాయింట్. అసలు కథ స్టార్ట్ అయిన విధానం రొటీన్ గానే ఉంది. ఇక ఆమె సినిమాలపై ఉన్న విరక్తిని తప్పించి ఆమెను ఒప్పించడం కోసం అతను చేసే పోరాటమే.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.


ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. ఫస్ట్ ఆఫ్ ప్లాట్‌ని సెట్ చేయడానికి చాలా సమయం తీసుకుంది. ఫస్ట్ హాఫ్‌లో పెద్దగా హైలైట్స్ కామెడీ సన్నివేశాలు లేకపోవడం పెద్ద లోపం. పాత్రల మధ్య కొంత స్లో-పేస్డ్ డ్రామా వల్ల కథ ముందుకు సాగదు. అమ్మాయికి హీరోపై మంచి ఇంప్రెషన్ వచ్చే సన్నివేశాలు నేచురల్ గానే కనిపిస్తాయి. ఇక ప్రీ ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం బాగుంది. కానీ ట్విస్ట్ రివీల్ అయ్యే వరకు కథను లాగినట్లు కనిపిస్తుంది. వెన్నెల కిషోర్ సీన్స్ అక్కడక్కడా క్లిక్ అయ్యాయి.

ఇక సెకండాఫ్ హెవీగా ఉన్నా ఫస్ట్ హాఫ్ కంటే మెరుగ్గా ఉంది. కానీ మరికొంత సేపటికి కొన్ని సీన్స్ ఊహించినట్లే ఉంటాయి. చాలా యాదృచ్చిక సంఘటనలు ఆడియెన్స్ కు కనెక్ట్ కావడానికి ఇబ్బందిని కలిగిస్తాయి. సెకండాఫ్‌లో ఫ్లో బాగానే ఉన్నా, చాలా సన్నివేశాలు ఊహించేలా ఉన్నాయి. ఇక క్లైమాక్స్‌లో కొన్ని ఎమోషనల్ సీన్స్ మాత్రం హత్తుకునేలా ఉన్నాయి. ఇక మ్యూజిక్ ఈ సినిమాకు కొంచెం హెల్ప్ చేసినా బాగుండేది కానీ ఆ రూట్లో కంపోజర్ నిరాశపరిచాడు. ఫైనల్ గా సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ ఎమోషనల్ డ్రామా మాత్రమే క్లిక్ అయ్యాయి.  


ప్లస్ పాయింట్స్:
👉ఇంటర్వెల్ ట్విస్ట్
👉క్లయిమ్యాక్స్

మైనస్ పాయింట్స్:
👉రోటీన్ కథ
👉మ్యూజిక్
👉ఫస్ట్ హాఫ్

రేటింగ్: 2.25/5

Post a Comment

Previous Post Next Post