ప్రభాస్ తో సినిమా తీసేందుకు డైరెక్టర్ మారుతి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఫ్యాన్స్ ఈ కాంబినేషన్ పై పెదవి విరుస్తున్నప్పటికి యూవీ క్రియేషన్స్ మాత్రం ధీమాగా ఉంది. మారుతి అనుకుంటే బలమైన కంటెంట్ తో అందరిని మెప్పించగలడు అని అనుకుంటున్నారు. ఇక మారుతి ప్రాజెక్ట్ స్టార్ట్ కావడానికి మరికొంత సమయం పట్టవచ్చు.
అసలైతే ప్రభాస్ దసరా అనంతరం మారుతి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాల్సింది. కానీ పక్కా కమర్షియల్ డిజాస్టర్ తో మళ్ళీ అంచనాలు తలక్రిందులయ్యాయి. మరోవైపు కృష్ణంరాజు మరణంతో ప్రభాస్ బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం ప్రభాస్ ప్లాన్ ప్రకారం నవంబర్ లో మారుతి సినిమా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్లు టాక్. అయితే 2023 జనవరిలో ఆదిపురుష్ విడుదల ఉంది కాబట్టి ఆ టైమ్ లో ప్రమోషన్స్ కోసం తిరగాల్సి ఉంటుంది. కుదరకపోతే మారుతి సినిమా షూటింగ్ ఆదిపురుష్ రిలీజ్ అనంతరం స్టార్ట్ కావచ్చని టాక్.
Follow
Post a Comment