మహేష్ కోసం హాలీవుడ్ హీరో.. తెస్తే రెమ్యునరేషన్ ఇవ్వగలరా?


క్రిస్ హేమ్స్‌వర్త్‌ అనే హాలీవుడ్ స్టార్ ను మహేష్ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర కోసం రాజమౌళి రంగంలోకి దింపే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ గా మారుతోంది. అసలు ఇప్పటి వరకు ఫైనల్ స్క్రిప్ట్ ఇంకా సిద్ధం కాలేదు. జక్కన్న బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అయిన తరువాతనే ఆర్టిస్టుల కోసం వెతుకుతాడు. అయితే ఈసారి క్రిస్ హేమ్స్‌వర్త్‌ను సెలెక్ట్ చేయవచ్చని అంటున్నారు.

అందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాన్ని పక్కన పెడితే రాజమౌళి అతనికున్న డిమాండ్ ను బట్టి రెమ్యునరేషన్ ఇప్పించగలరా అనేది మరో ఆసక్తికరమైన అంశం. అతను ఒక్కో సినిమాకు 160 కోట్లకు పైగా డిమాండ్ చేసే ఛాన్స్ ఉంది. ఎంత కాదనుకున్నా చిన్న రోల్ అనుకున్నా 100 కోట్లకు అటు ఇటుగా ఉన్నా బడ్జెట్ పెరగవచ్చు. అప్పటికే మహేష్ కు 100కోట్లు ఇచ్చినా ఆ తరువాత మేకింగ్ కోసం 300 కోట్లు.. ఇలా అన్ని కలుపుకుంటే బడ్జెట్ 500 నుంచి 600 కోట్ల వరకు వెళితే ఒత్తిడి పెరిగే ఛాన్స్ ఉంది. రాజమౌళి మార్కెట్ ను బట్టి తన శక్తి మేర ఆర్టిస్టులను తీసుకు వస్తుంటారు. మరి ఈ సారి క్రిస్ హేమ్స్‌వర్త్‌కు తక్కువలో ఒప్పించి తీసుకు వస్తారో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post