బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?


బాలీవుడ్లో చాలా కాలం తర్వాత విడుదలవుతున్న అతిపెద్ద సినిమా బ్రహ్మాస్త్ర పార్ట్ 2 శివ,  మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ చదువుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది. ఇక శుక్రవారం రోజు సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ లో కూడా భారీ స్థాయిలో విడుదలవుతున్న ఈ సినిమా సక్సెస్ కావాలి అంటే మొత్తం ఎంత కలెక్ట్ చేయాలి అలాగే ఇప్పటివరకు నాన్ థియేట్రికల్ గా ఎంత రాబట్టింది అనే వివరాల్లోకి వెళితే..

ఈ సినిమాకు అన్ని భాషల్లో కలుపుకొని శాటిలైట్ ఓటీటీ డిజిటల్ ఆడియో రైట్స్ కలుపుకొని దాదాపు 150 కోట్ల వరకు వెనక్కి తెచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమాకు దాదాపు 410 కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద బిజినెస్ పరంగా అయితే సినిమా 420 కోట్లు రాబడితేనే. హిట్ అయినట్లు లెక్క. నిర్మాతలు అయితే చాలా ఏరియాల్లో సినిమాను అమ్మేసుకున్నారు. ఇక బయ్యర్లకు ఎక్కువ కలెక్షన్స్ వస్తే లాభాల్లో వాటా వస్తుంది. మరి మొత్తంగా బ్రహ్మాస్త్ర ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post