రాజమౌళి కోసం మహేష్, త్రివిక్రమ్ న్యూ ప్లాన్?


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో మొదటి పాన్ ఇండియా సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా కంటే ముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా ఒక ఫ్యామిలీ యాక్షన్ సినిమాను చేయబోతున్నాడు. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తీసుకు రావాలని అనుకుంటున్నారు. కానీ ఇంకా మహేష్ నుంచి ఆమోదం రావాల్సి ఉంది.

అయితే ఈ క్రమంలో త్రివిక్రమ్ సినిమాను అయితే వీలైనంత త్వరగా మహేష్ పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే రాజమౌళి రెడీ అనగానే ఫిట్నెస్ లో కూడా కొంత మార్పులు చేయాల్సి ఉంటుంది కాబట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలోని భారీ సన్నివేశాలను ముందుగానే ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. ఫస్ట్ షెడ్యూల్లోనే ఒక లాంగ్ యాక్షన్ సన్నివేశాన్ని ఫినిష్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక తర్వాత డైలాగ్స్ కు సంబంధించిన సన్నివేశాలు మాత్రం చివర్లో పూరి చేసుకోవాలి అని మహేష్ డిసైడ్ అయ్యాడట. అందుకు తగ్గట్టుకుని త్రివిక్రమ్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post