దిల్ రాజుకి వారసుడి టెన్షన్!


టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఇటీవల కాలంలో ఒకేసారి బిగ్ బడ్జెట్ సినిమాలను తెరపైకి తీసుకు వస్తున్నాడు. ఇదివరకే రామ్ చరణ్ - శంకర్ కలయికలో RC 15 అనే ప్రాజెక్ట్ ను 170 కోట్ల పెట్టుబడితో స్టార్ట్ చేశాడు. ఇక మరోవైపు విజయ్ తో తమిళ్ తెలుగులో ఒకేసారి వారసుడు అనే సినిమాను విడుదల చేయబోతున్నాడు.

చరణ్ సినిమా గురించి పక్కన పెడితే విజయ్ వారసుడు విషయంలో దిల్ రాజు టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాజెక్ట్  కోసం విజయ్ కు దాదాపు 90 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చాడు. అలాగే సినిమా బడ్జెట్ 60 నుంచి 70 కోట్ల మధ్యలో అనుకున్నా సినిమాపై 150 కోట్లకు పైగానే ఇన్వెస్ట్ చేస్తున్నట్లు లెక్క. 

ఇక వారసుడు సినిమాను సంక్రాంతికి విడుదల చేసి క్యాష్ చేసుకోవాలని అనుకున్నారు. కానీ వారసుడు సినిమాకు ఒకవైపు తమిళంలో అజిత్ తునివు సినిమాతో పోటీ ఉండనుంది. మరోవైపు తెలుగులో కూడా అదిపురుష్, NBK107/వాల్తేరు వీరయ్య, ఏజెంట్ అంటూ స్టార్ హీరోల సినిమాల నుంచి మరింత పోటీ నెలకొంది. దీంతో దిల్ రాజు కాస్త టెన్షన్ లోనే పడినట్లు తెలుస్తోంది. సినిమాకు ఎంతో మంచి టాక్ వస్తే గాని సెట్ అయ్యే అవకాశం ఉండదు. మరి ఎలా రిలీజ్ చేస్తారో చూడాలి.

Post a Comment

Previous Post Next Post