అఖండ కంటే ఎక్కువ స్థాయిలో NBK 107 బిజినెస్!


నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక తదుపరి సినిమా తప్పకుండా అంతకుమించి రికార్డులను క్రియేట్ చేయవచ్చని అంచనాలు ఏర్పడుతున్నాయి. క్రాక్ సినిమాతో సక్సెస్ అందుకున్న గోపిచంద్ మలినేని ఆ సినిమాను డైరెక్ట్ చేస్తుండడంతో మార్కెట్ లో డిమాండ్ అయితే పెరిగింది. 

ఇక అఖండ సినిమా బాలకృష్ణ కెరీర్ లో అత్యధికంగా 55 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. ఇక బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా 74 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు NBK 107 వ ప్రాజెక్ట్ అంతకుమించి అనేలా బిజినెస్ చేసే ఛాన్స్ ఉందట. నిర్మాతలు అయితే నైజాంలో 20 కోట్లు చెబుతున్నారట. సీడెడ్ హక్కులు 14 కోట్లకు కోట్ చేస్తున్నట్లు సమాచారం. ఆంధ్ర మొత్తంలో 35 కోట్ల రేటు పలుకుతోందట. దీన్ని బట్టి సినిమా అటు ఇటుగా 75 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేయవచ్చని టాక్.

Post a Comment

Previous Post Next Post