దసరా బాక్సాఫీస్ ఫైట్.. టార్గెట్స్ ఫిక్స్!


దసరా ఫెస్టివల్ అక్టోబర్ 5వ తేదీన ఒకేసారి మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక ఈ సినిమాలలో గాడ్ ఫాదర్ సినిమా అత్యధిక బిజినెస్ చేయగా స్వాతిముత్యం సినిమా అతి తక్కువగా బిజినెస్ సివేసింది. మొత్తంగా ఈ దసర అయితే బాక్స్ ఆఫీస్ వద్ద మూడు సినిమాలకు కూడా ఎంతో కొంత హైప్ అయితే క్రియేట్ అయ్యింది.

ఇక ముందుగా గాడ్ ఫాదర్ సినిమా అయితే అత్యధిక స్థాయిలో విడుదలవుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 85 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలవుతొంది. మరోవైపు నాగార్జున సినిమా అయితే మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల వరకు బిజినెస్ చేయగా 20.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాల్సి ఉంటుంది. ఇక బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు బెల్లంకొండ గణేష్ బాబు నటించిన స్వాతిముత్యం సినిమాకు పెద్దగా హైప్ అయితే లేదు. కానీ ఈ సినిమా సక్సెస్ అవుతుంది అని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. ఇక ఈ సినిమా సక్సెస్ కావాలి అంటే మినిమం 4 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది.

Post a Comment

Previous Post Next Post