God Father - Movie Review


కథ:
పొలిటికల్ డ్రామాగా కొనసాగే గాడ్ ఫాదర్ కథ ముఖ్యమంత్రి పదవి చుట్టూ తిరుగుతుంది. జన జాగృతి పార్టీకి చెందిన ప్రస్తుత సిఎం పికెఆర్ మరణించినప్పుడు, తదుపరి కుర్చీని ఎంచుకునేందుకు కొందరు ప్రయత్నం చేస్తుంటారు. ఇక అప్పుడే బ్రహ్మ (చిరంజీవి) ఆ వాతావరణంలోకి ప్రవేశించి కింగ్‌మేకర్‌గా ఎలా మారతాడు? సత్య ప్రియ (నయనతార), జయ దేవ్ (సత్య దేవ్) అలాగే వర్మ (మురళీ శర్మ) ఎలాంటి ప్లాన్స్ వేశారు?  సినిమా యొక్క ప్రాథమిక కథాంశం. ఇక బ్రహ్మ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అనేది ఉత్కంఠభరితమైన మరో పాయింట్.

విశ్లేషణ:
మోహన్ రాజా దర్శకత్వంలో తెరపైకి వచ్చిన గాడ్ ఫాదర్ మలయాళం లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరపైకి వచ్చింది. మొదటగా, ఒరిజినల్ మలయాళ వెర్షన్ నుండి తెలుగు రీమేక్‌కి కొన్ని మార్పులు చేయబడ్డాయి. హీరో ఎంట్రీ నుంచి ఎలివేషన్స్ సీన్స్ వరకు దర్శకుడు మార్పులు అయితే గట్టిగానే చేశాడు. రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలు తెలుగు సినిమాకి కొత్తేమీ కాదు, కానీ మెగాస్టార్ చిరంజీవి ఉండటం దీనికి భిన్నమైన రుచిని ఇస్తుంది.  వివిధ పాత్రల మధ్య ఘర్షణలు వాటి చుట్టూ ఉన్న డ్రామా ఫస్ట్ హాఫ్ మొత్తంలో నడుస్తుంది. 

ముఖ్యంగా ఇంటర్వెల్ సమయానికి మెగాస్టార్ చిరంజీవి ఎలివేషన్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక సెకండ్ హాఫ్ పై అంచనాలను కూడా పెంచుతుంది. సెకండ్ హాఫ్ తర్వాత అసలు దర్శకుడు సినిమాను మరో కోణంలో చూపించే ప్రయత్నం చేశాడు. ఒకవైపు రాజకీయాలు అలాగే ఆధిపత్యాన్ని చూపిస్తూ మరొకవైపు యాక్షన్ ఎలివేషన్ సన్నివేశాలను కూడా కరెక్ట్ గానే ప్రజెంట్ చేశారు. ఇక సెకండ్ హాఫ్ లో సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఇచ్చే విధానం కూడా ఐ వోల్టేజ్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. తప్పకుండా కొన్ని సన్నివేశాలు మాత్రం సినిమాల్లో బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ ఫైట్స్ సన్నివేశాల్లో కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం మరి నాసిరకంగా అనిపిస్తాయి. మెగాస్టార్ హోదా ఉన్న హీరోలు నటిస్తున్నప్పుడు ఇలాంటి గ్రాఫిక్స్ ఏమిటి అని భావన రాకుండా ఉండదు.

కానీ కొన్ని మెగాస్టార్ చిరంజీవి సన్నివేశాలు మాత్రం మరి ఎక్కువ స్థాయిలో ఉన్నట్లుగా కూడా రొటీన్ గా అనిపిస్తుంది. అనవసరంగా ఎలివేషన్ ఇచ్చిన భావన కూడా కలుగుతుంది. కానీ కథలోకి ఆడియెన్స్ లీనమైతే అవి ఏమి పెద్దగా మైనస్ గా మారకపోవచ్చు. మరోవైపు సత్యదేవ్ నయనతార పాత్రలు కూడా ఈ సినిమాకు చాలా బాగా హెల్ప్ అయ్యాయి. మిగతా నటీనటులు కూడా ఈ సినిమాలో అద్భుతంగా నటించారు ఇక తమన్న మ్యూజిక్ కూడా ఈ సినిమాకు మరొక ప్లస్ పాయింట్ గా నిలిచింది. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలకు మంచి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చాడు.

ఇక సెకండాఫ్ మధ్యలో మాత్రం కొంచెం నీరసంగా అనిపించే సన్నివేశాలు ఉన్నాయి. అలాగే సునీల్ కు సంబంధించిన పాత్రలు అయితే అంతగా క్లిక్ అవ్వలేదు. ఇక ఈ సినిమాకు సంబంధించిన స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు చేసిన మ్యాజిక్ అయితే మరీ అంత కొత్తగా ఏమీ లేదు కానీ ఒకసారి చూడవచ్చు అనే విధంగా అనిపిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుందా లేదా అనేది మరొక పెద్ద డౌటే. మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్ లేకుండా పెద్దగా డ్యూయెట్ సాంగ్స్ కూడా లేకుండా చేయడం అనేది సరికొత్త ప్రయోగమే. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.
 
ప్లస్ పాయింట్స్:
👉మెగాస్టార్ చిరంజీవి
👉సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీన్స్
👉స్టార్ క్యాస్ట్

మైనస్ పాయింట్స్:
👉అనవసరమైన ఎలివేషన్స్
👉క్లయిమ్యాక్స్

రేటింగ్: 3/5

2 Comments

Post a Comment

Previous Post Next Post