బాలయ్య, చిరు.. రూ.35కోట్ల బేరం!

 


నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి నుంచి రాబోతున్న వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి భారీ స్థాయిలో విడుదల కాబోతున్నాయి. అయితే ఈ రెండు సినిమాలను కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు కూడా దాదాపు తుది దశకు చేరుకున్నాయి.


అయితే నైజాం ఏరియాలో రెండు సినిమాలకు కూడా మంచి డిమాండ్ అయితే ఏర్పడింది. ఈ రెండు సినిమాలకు కలిపి ఒకే సంస్థ 35 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ లోనే మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ తరపున 35 కోట్ల బిజినెస్ తో ఈ సినిమాను నైజాం హక్కులను కొనుగోలు చేశారు. మైత్రి సొంత ప్రొడక్షన్ లోనే కొంతమంది ఈ సినిమాను పర్సనల్ గా కొనుగోలు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మరి రెండు సినిమాలతో డిస్ట్రిబ్యూటర్స్ కి ఎలాంటి ప్రాఫిట్స్ వస్తాయో చూడాలి.

Post a Comment

Previous Post Next Post