అల్లు అర్జున్ vs ప్రభాస్.. ఒకే కథ కోసం!


టాలీవుడ్ ఫ్యాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతున్న అల్లు అర్జున్ ప్రభాస్ ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో స్టార్ హోదాను అందుకున్నారు అని చెప్పవచ్చు. అయితే ప్రభాస్ అల్లు అర్జున్ ఒకానొక సమయంలో వారికి తెలియకుండానే ఒక కథ కోసం పోటీపడినట్లుగా తెలుస్తోంది. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు జయంతి సి పరాన్జీ ద్వారా ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రభాస్ నటించిన ఈశ్వర్ సినిమా వచ్చి నేటికీ 20 ఏళ్ళు కావస్తోంది. ఇక ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మొదట ఈశ్వర్ కథ కోసం మరొక హీరోను కూడా అనుకున్నట్లు చెప్పాడు. పూర్తిస్థాయిలో పేరు చెప్పలేదు కానీ మంచి బ్యాగ్రౌండ్ ఉన్న హీరో మొదటి సినిమాగా కూడా ఈశ్వర్ కథ కోసం అనుకున్నట్లు చెప్పారు. అయితే ప్రభాస్ ను చూడగానే ఈ కథకు పర్ఫెక్ట్ గా అతను మాత్రమే సెట్ అవుతాడు అని అనిపించి ఫిక్స్ చేసినట్లు జయంత్ తెలిపారు. ఇక ఆయన ప్రభాస్ తో పాటు అనుకున్న మరొక హీరో మరెవరో కాదు అల్లు అర్జున్ అని అప్పట్లోనే ఒక టాక్ వచ్చింది.
Post a Comment

Previous Post Next Post