ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రభావం కారణంగా కొన్ని వీడియోలు పాటలు చాలా తొందరగా వైరల్ అవుతున్నాయి. అయితే వాటి వల్ల కొన్ని నష్టాలు మరికొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ట్రోలింగ్ అనేది కొంతమందిని చాలా బాధగా గురిచేస్తుంది. ఇక ఇటీవల జిన్నా ఈవెంట్ లో పాడిన జారు మిఠాయ పాట పై ట్రోలింగ్ ఒక రేంజ్ లో జరిగింది.
అయితే ఆ పాట పాడిన సింగర్ భారతమ్మ ఒక ఇంటర్వ్యూలో ఆ పాటకు సంబంధించిన అర్థాన్ని చెప్పే ప్రయత్నం చేసింది. చిన్నప్పుడు గొర్రెలను మేకలను కాసే సమయంలో గ్రామాలను చూస్తూ వాటి అందాలను పొగుడుతూ చెప్పేదే జారు మిఠాయ అని అర్థమని.. ఇక తోటి అమ్మాయికి జడవేసే సందర్భంలో ‘జడేస్తా జడేస్తా చూడు.. నచ్చకుంటే తీసేస్తా చూడు’ అనే పడుతుంటామని ఇది చిత్తూరు జానపధల్లో ఒకటి అని అన్నారు. ఇక ‘జంకలకిడి జారు మిఠాయి’ అంటే అమ్మాయి పేరు అని భారతమ్మ చెప్పారు. ఇక మంచు మోహన్ బాబు ఆ పాట పాడినందుకు 50 వేల రూపాయలు ఇచ్చారు అని ఆమె చెప్పారు.
Follow
Post a Comment