స్పైడర్ డైరెక్టర్.. మరో ప్రయోగం!

 

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎఆర్ మురుగదాస్.. గజిని, తుపాకీ కత్తి వంటి కొన్ని క్రేజీ సినిమాలతో మంచి క్రేజ్ అందుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈ స్టార్ డైరెక్టర్ గత కొంతకాలంగా వరుస అపజయాలను ఎదుర్కొంటున్నాడు. స్పైడర్ తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ చూసాడు. ఇక రజనీతో చేసిన చివరి చిత్రం దర్బార్ తీవ్ర నిరాశను మిగిల్చింది. అనంతరం విజయ్ తో అనుకున్నప్పటికి సెట్టవ్వలేదు.


ఇక తమిళ ఫిల్మ్ సర్కిల్స్‌ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం దర్శకుడి తదుపరి ప్రాజెక్ట్ యానిమేషన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని టాక్ వస్తోంది. వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీతో  కూడా ఇప్పటికే ఒక ప్లాన్ రెడీ చేసుకున్నట్లు సమాచారం. అలాగే ఈ దర్శకుడు క్రేజీ యాక్టర్ శింబుతో చేసే అవకాశం కూడా ఉందనే మరో టాక్ వినిపిస్తోంది. ఈ వార్త సోషల్ ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది. మరి ఒకప్పటి ఈ స్టార్ డైరెక్టర్ ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post