సుధీర్.. మంచు విష్ణు, అల్లు శిరీష్ కంటే ఎక్కువే!


సుడిగాలి సుధీర్.. మ్యాజిక్ లతో స్టేజ్ షోలు చేసుకుంటూ ఇప్పుడు వెండితెరపై హీరోయిజం చూపించే దశకు వచ్చాడు. కష్టపడి పైకొచ్చిన సుధీర్ ఇటీవల గాలోడు అనే సినిమాలో ఉరమాస్ క్యారెక్టర్ తో కనిపించాడు. సోషల్ మీడియాలో ఈ సినిమా రిలీజ్ హడావుడి పెద్దగా కనిపించలేదు కానీ బీ, సి సెంటర్లలో మాత్రం ఆడియెన్స్ ఈ సినిమాపై కొంత ఆసక్తి చూపించారు. 

ఇక బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో వచ్చిన బ్యాక్ గ్రౌండ్ కిడ్స్ కంటే కూడా సుడిగాలి సుధీర్ సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మంచు విష్ణు జిన్నా, అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో.. సినిమాల మొదటి రెండు రోజుల కలెక్షన్స్ కంటే కూడా సుధీర్ గాలోడు కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పైగా థియేటర్స్ సంఖ్య కూడా వారి కంటే కాస్త తక్కువే.

దీన్ని బట్టి సుధీర్ స్థాయి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ కిడ్స్ కంటే కూడా సుధీర్ కష్టపడి వచ్చిన విధానం.. అలాగే ఎంటర్టైన్మెంట్ షోలతో అతనికి వచ్చిన క్రేజ్.. కొంత గాలోడు సినిమాకి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. ఇక గాలోడు కంటెంట్ పరంగా పెద్దగా పాజిటివ్ టాక్ ఏమి అందుకోలేదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో సుధీర్ మాస్ క్యారెక్టర్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది.. అనే ఆలోచనతో దర్శకుడు ప్రయోగం చేసినట్లు ఉంది. 

ఏదేమైనా సినిమా కంటెంట్ ఎలా ఉన్నా సుధీర్ క్రేజ్ తో నిర్మాత థియేట్రికల్ గా బాగానే క్యాష్ చేసుకున్నట్లు అనిపిస్తోంది. ఇక లైనప్ లో సుధీర్ మరో మాస్ సినిమా కూడా చేస్తున్నాడు. మరో రెండు ప్రాజెక్ట్ లు కూడా చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సుధీర్ కాస్త ప్రయోగాలు చేస్తూ మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయగలిగితే బాక్సాఫీస్ వద్ద క్లిక్కయ్యే ఛాన్స్ ఉందని గాలోడు ఓపెనింగ్స్ చెప్పేశాయి. మరి సుధీర్ ఈ లక్కీ టైమ్ ను ఎలా యూజ్ చేసుకుంటాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post