బాలయ్య కోసం పవన్ విలన్!

 

నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. బాలయ్య బాబు 108వ సినిమాగా తెరపైకి రాబోతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కథ కూడా ఫైనల్ అయిపోయింది. ఇక వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ ను పూర్తి చేసే సినిమాను వచ్చే ఎడాదే సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు అనిల్ ఆలోచిస్తున్నాడు. అయితే ఇటీవల సినిమాలో క్యాస్టింగ్ విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.


ఈ సినిమా కోసం దర్శకుడు.. పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తున్న ఒక పవర్ఫుల్ విలన్ ను రంగంలోకి దించబోతున్నట్లు సమాచారం. బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును అందుకున్న అర్జున్ రాంపాల్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో ప్రధాన విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఇప్పుడు బాలయ్య కోసం దర్శకుడు అనిల్, అర్జున్ రాంపాల్ ను సెలెక్ట్ చేసుకోవడానికి రెడీ అయినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే క్యాస్టింగ్ విషయంలో కూడా చిత్ర యూనిట్ సభ్యుల అధికారికంగా ఒక క్లారిటీ ఇవ్వనున్నారు.

Post a Comment

Previous Post Next Post