నాగ్ డైరెక్టర్ తో సమంత ప్లాన్?

సమంత యశోద సినిమాతో యాక్టర్ గా మరోసారి మంచి గుర్తింపు అయితే అందుకుంది. కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం పూర్తిస్థాయిలో ప్రాఫిట్ లోకి రాలేదు. సోమవారం నుంచి కలెక్షన్స్ కొంత తగ్గుతూ వస్తున్నాయి. నిర్మాత భారీ స్థాయిలో అయితే నష్టాలను చూడలేదు కానీ పలు ఏరియాలలో డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం నష్టపోయే అవకాశం ఉంది. ఇక సమంత మరో లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ సినిమా చేసేందుకు ఒక యువ దర్శకుడు చర్చలు జరుపుకున్నట్లు సమాచారం.


ఆ దర్శకుడు మరెవరు కాదు ఇంతకు ముందు నాగార్జునతో డిజాస్టర్ సినిమా తీసిన రాహుల్ రవీంద్రన్ అని తెలుస్తోంది. రాహుల్ మొదట చిలసౌ అనే సినిమాతో దర్శకుడిగా జాతీయస్థాయిలో అవార్డు కూడా అందుకున్నాడు. అనంతరం నాగార్జునతో మన్మధుడు 2 సినిమాను తెరపైకి తీసుకువచ్చాడు. ఆ సినిమా దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఇక సమంతతో ఎప్పటినుంచో రాహుల్ కి మంచి పరిచయం ఉంది. అతని భార్య సింగర్ చిన్మయి సమంత సినిమాలకు ఒకప్పుడు వరుసగా డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ దర్శకుడితో ఒక లేడీ లిమిటెడ్ ప్రాజెక్టు చేసేందుకు సమంత చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంలో ఒక క్లారిటీ రానుంది.

Post a Comment

Previous Post Next Post