ఈ వారం సినిమాలు.. మినీ బాక్సాఫీస్ ఫైట్


ఈ వారం థియేట్రికల్ గా మొత్తం 5 సినిమాలు రాబోతున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలకు సీజన్స్ తో సంబంధం లేకుండా ఆడియెన్స్ నుంచి మంచి సపోర్ట్ అయితే దక్కుతోంది. ఇక గత వారం వచ్చిన రెండు చిన్న సినిమాలు గాలోడు, మసూద బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. ఇక ఈ నెల 25న శుక్రవారం రోజు రాబోయే సినిమాలపై మరీ అంత పెద్దగా బజ్ లేదు.


అల్లరి నరేష్ నటించిన 'ఇట్లు మరేడుమిల్లి ప్రజానీకం' అనే సినిమా మాత్రమే కాస్త చెప్పుకోదగ్గ సినిమా. ఇక హిందీ మూవీ బేడియా ను అల్లు అరవింద్ తెలుగులో తోడేలుగా రిలీజ్ చేస్తున్నారు. దిల్ రాజు తమిళంలో హిట్టయిన లవ్ టుడే సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇక వీటితో పాటు రణస్థలి, చెడ్డి గ్యాంగ్ షో అనే మరో రెండు సినిమాలు కూడా ఈ శుక్రవారం విడుదల కాబోతున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఇది ఒక మినీ యుద్ధమే అని చెప్పవచ్చు. కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ భాషతో, స్టార్ క్యాస్ట్ తో సంబందం లేకుండా చూస్తారు. మరి ఈ సినిమాల్లో ఏది బిగ్ హిట్ గా నిలుస్తుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post