అవతార్ 2 బడ్జెట్ ఎంతో తెలుసా?

 2010లో వచ్చిన అవతార్ సినిమాకి సీక్వెల్ గా అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్ డిసెంబర్ 16వ తేదీన విడుదల కానుంది. టైటానిక్ దర్శకుడు జేమ్స్ కెమెరున్ సృష్టించిన సెకండ్ అవతార్ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుంది అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే అవతార్ 2 కోసం బడ్జెట్ ఎంత అయ్యిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.


మొదట అవతార్ 1 ను (ఇండియన్ కరెన్సీలో) 1200 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించగా అది వరల్డ్ వైడ్ గా రూ.18,957 కోట్లను అందుకుంది. ఇక ఇప్పుడు అవతార్ 2 కోసం 250 మిలియన్ డాలర్స్ ను ఖర్చు చేశారు. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.1909 కోట్లు. ఇక ఇప్పుడు హడావుడి చూస్తుంటే అవతార్ రికార్డుతో పాటు హాలీవుడ్ పాత రికార్డులన్ని కూడా బ్రేక్ అవుతాయని అనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అవతార్ 2 మొత్తంగా 160 భాషల్లో విడుదల అవుతోంది. ఇక తెలుగులో 100 కోట్ల బిజినెస్ చేయబోతున్నట్లు సమాచారం.

Post a Comment

Previous Post Next Post