కొడుకులను కాదని.. ఆ హీరో కోసం నాగ్ పెట్టుబడి!


అక్కినేని హీరోల ప్రొడక్షన్ హౌస్ అన్నపూర్ణ స్టూడియోస్ సినిమాలను నిర్మించడంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఇక త్వరలోనే ఈ సంస్థ నుంచి మొదటి పాన్ ఇండియా సినిమా రానుంది. అది కూడా అక్కినేని హీరోలతో కాకుండా బయట హీరోలతో భారీ సినిమాని నిర్మించాలని నాగార్జున డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.


ఇక అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదటి పాన్ ఇండియా చేస్తున్న హీరో మరెవరో కాదు అడివి శేష్ అని తెలుస్తోంది. నాగార్జున స్వయంగా అతనితో సినిమా చేయడానికి డిసైడ్ అయ్యారట. ఇదివరకే మహేష్ బాబు అడివి శేష్ తో GMB ప్రొడక్షన్ లో మేజర్ అనే సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు నాగార్జున కూడా భారీ బడ్జెట్ తో అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అన్నపూర్ణలో అక్కినేని నాగచైతన్య, అఖిల్ ఇద్దరు ఉన్నప్పటికీ మొదటి పాన్ ఇండియా సినిమాను మరో హీరోతో నిర్మించడం విశేషం.

Post a Comment

Previous Post Next Post