అ! డైరెక్టర్.. ఇవే తగ్గించుకుంటే మంచిది!


 అ! దర్శకుడు ప్రశాంత్ వర్మ మొదటి సినిమాతోనే ఓ వర్గం ఆడియెన్స్ ను ఒక రేంజ్ లో ఎట్రాక్ట్ చేశాడు. ఆ తరువాత కల్కి అనే సినిమా తీశాడు. కానీ ఆ సినిమా కమర్షియల్ గా ఆడలేదు. ఇక జాంబీ రెడ్డి పరవాలేదు అనిపించగా ఇప్పుడు హనుమాన్ అనే పాన్ ఇండియా సినిమాతో సిద్ధమవుతున్నాడు. ఇక ఇటీవల హనుమాన్ టీజర్ విడుదలైన సందర్భంగా గెటప్ శ్రీను అతన్ని మరో రాజమౌళి అని పొగడడం వైరల్ గా మారింది.


రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి RRR వరకు ప్రతీ సినిమాలో కమర్షియల్ ఫార్మాట్ లోనే సరికొత్త ప్రయోగలతో సక్సెస్ అందుకున్నాడు. అతను పడే కష్టం ఆలోచనా విధానం మామూలుగా ఉండదు. అలాంటి జక్కన్న తో ప్రశాంత్ వర్మను పోల్చడం అసలు కరెక్ట్ కాదని కామెంట్స్ వస్తున్నాయి. నిజానికి ప్రశాంత్ వర్మను ఎందుకంత లేపుతారో అనేవారు కూడా ఉన్నారు.  

నిజానికి ఈ దర్శకుడు ప్రతీ సారి తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదని కాస్త ఎక్కువగానే చెబుతూ ఉంటాడనే కామెంట్ కూడా ఉంది. అతను దాదాపు హాలీవుడ్ కంటెంట్ ను తీసుకొచ్చి తెలుగు కలరింగ్ ఇస్తాడు అనే సినీ లవర్స్ లేకపోలేదు. అ! సినిమా నచ్చి ఉంటే నాని అతనితోనే మళ్ళీ సీక్వెల్ తీసి ఉండేవాడు. ఏదేమైన మనోడు టాలెంటెడ్. ఇంకా అతనికి కెరీర్ లో చాలా అనుభవం రావాల్సి ఉంది. అప్పుడే అతిగా లేపకుండా నేటితరం శైలేష్ కొలను, నాగ్ అశ్విన్, తరుణ్ భాస్కర్ తరహాలో సింపుల్ గా ఉండనిస్తే బెటర్.

Post a Comment

Previous Post Next Post