అల్లరి నరేష్ పై సేఫ్ బిజినెస్

 


అల్లరి నరేష్ వరుస డిజాస్టర్స్ తో పదేళ్ళ వరకు స్త్రగుల్ అయ్యాడు. ఇక గత ఏడాది నాంది సినిమాతో ఫామ్ లోకి వచ్చిన నరేష్ ఇప్పుడు దాదాపు అదే తరహా డిఫరెంట్ కాన్సెప్ట్ తో 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ చిత్రంలో మారేడుమిల్లి గిరిజన ప్రాంతంలో ఎన్నికల విధులకు వెళ్లే ప్రభుత్వ అధికారిగా నరేష్ కనిపించనున్నాడు. ఇక అక్కడ ఎన్నికల నియమాలను తప్పుదారి పట్టించడంపై హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనేది సినిమా కథ.


ఇంతకుముందు నాంది సినిమాకు దాదాపు 2.50 కోట్ల వరకు ఖర్చు చేయగా మరో రెండు కోట్లకు పైగా ప్రాఫిట్ అయితే దక్కింది. నాన్ థియేట్రికల్ గా కూడా నిర్మాతకు మరో కోటి వరకు ప్రాఫిట్ అందించింది. ఇక ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాకు ఈసారి మరికొంత ఎక్కువగా ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. 3.50 కోట్ల నుంచి 4 కోట్ల మధ్యలో బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. థియేట్రికల్ బిజినెస్ అదే రేంజ్ లో జరిగే ఛాన్స్ ఉంది. ఇక నవంబర్ 25న రానున్న ఈ సినిమా నాంది రేంజ్ లో ప్రాఫిట్ అందిస్తుందో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post