మరోసారి తండ్రి డబ్బు పోగొట్టిన అల్లు శిరీష్

 


టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యువ హీరోలలో అల్లు శిరీష్ ఒకరు. ఇటీవల ఊర్వశివో రక్షసివో సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని అనుకున్నాడు. రాకేష్ శశి చెప్పిన కథను అల్లు శిరీష్ నమ్మినంత ఎవరు నమ్మలేదు. ఎంతో అనుభవం ఉన్న అల్లు అరవింద్ అది అంతగా వర్కౌట్ కాదని కొంత వాదించడట.


ఇక అల్లు శిరీష్ తండ్రికి నచ్చే వరకు కథలో మార్పులు చేసి ఫైనల్ గా ఆయన ఒప్పుకునే స్థితికి తీసుకు వచ్చాడు. ఇక సినిమాను మొదట 4 కోట్ల బడ్జెట్ తో ఫినిష్ అవుతుందని శిరీష్ మాట ఇచ్చాడు. కానీ ఆ తరువాత బడ్జెట్ డబుల్ అయ్యింది. 7 నుంచి 8 కోట్ల మధ్యలో ఇన్వెస్ట్ చేశారు. ఇక థియేట్రికల్ గా బిజినెస్ 7 కోట్ల వరకు జరిగింది. ఇక వరల్డ్ వైడ్ గా 3 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందుకున్న ఊర్వశివో రాక్షసివో.. సినిమా 4.50 కోట్ల రేంజ్ లో నష్టాలు కలిగించింది.

ఇంతకుముందు ABCD, ఒక్క క్షణం సినిమాలు కూడా దారుణంగా నష్టాలు కలుగజేశాయి. వాటికి నిర్మాతలు పేర్లు వేరైనా ఇన్వెస్ట్ చేసింది మాత్రం అల్లు అరవిందే. ఇక ఆ సినిమాలతోనే థియేట్రికల్ గా 12 కోట్ల రేంజ్ లో నష్టాలు రాగా ఇప్పుడు మరో నాలుగు కోట్ల వరకు పోయాయి. మరి రాబోయే రోజుల్లో శిరీష్ ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post