అను పాపకు.. మరో అల్లు ఆఫర్!


గత కొంతకాలంగా అను ఇమ్మాన్యూయేల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ సక్సెస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది. ఆమె సక్సెస్ తో సంబంధం లేకుండా పెద్ద సినిమాల అవకాశాలు అందుకుంది కానీ అందుకు తగ్గట్టుగా కెరీర్ మాత్రం కొనసాగడం లేదు. అప్పట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాలో కూడా ఒకేసారి ఛాన్స్ అందుకొని లక్కీ గర్ల్ అనిపించుకుంది.

కానీ ఆ రెండు సినిమాలు కూడా డిజాస్టర్ కావడంతో అమ్మడికి మళ్ళీ స్టార్ హీరోలతో అవకాశాలు దొరకలేదు. ఇక మళ్ళీ అల్లు వారి కాంపౌండ్ లోనే అల్లు శిరీష్ తో సినిమా చేసింది. రీసెంట్ గా వచ్చిన ఊర్వశిఓ రాక్షసిఓ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. అయితే GA2 లోనే  మళ్ళీ మరో అవకాశం వచ్చే విధంగా అల్లు అర్జున్ తన టీం కి చెప్పినట్లు తెలుస్తోంది. అమ్మడు మరో సినిమా చేసేందుకు గీతా ఆర్ట్స్ లో సైన్ చేసినట్లు సమాచారం.

2 Comments

Post a Comment

Previous Post Next Post