ఆ రీమేక్ కోసం రవితేజ - సిద్ధు?

రీమేక్ సినిమాలు అంటే ఇప్పుడు చాలా రిస్క్ తో కూడుకున్న పని. ఓటీటీ ప్రభావం ఎక్కువైన తరువాత ఆడియెన్స్ కంటెంట్ నచ్చితే భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూస్తున్నారు. అందుకే ఇప్పుడు తెలుగులో కొంతమంది హీరోలు కూడా రీమేక్ సినిమాలు చేయడానికి పెద్దగా ఇష్టపడడం లేదు. అయితే గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ ఇటీవల ఒక తమిళ సినిమా కథకు తెలుగు స్టైల్ లో స్క్రిప్ట్ రెడీ చేసినట్లుగా తెలుస్తోంది.


ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా ఆ రీమేక్ సినిమాను నిర్మించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఆ కథ మరేదో కాదు తమిళంలో మంచి సక్సెస్ అందుకున్న మానాడు అని తెలుస్తోంది. శింబు నటించిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక తెలుగులో రవితేజ హీరో క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక విలన్ పాత్రలో సిద్ధు జొన్నల గడ్డను అనుకుంటున్నట్లు టాక్ వస్తోంది. మరి ఇదేంతవరకు నిజమో తెలియాలి అంటే అధికారికంగా క్లారిటీ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.

Post a Comment

Previous Post Next Post