దిల్ రాజును రెచ్చగొడుతున్నారా?


సినిమా ఇండస్ట్రీలో ఆ నలుగురు అనే ఆధిపత్యం ఉంది అని చాలామంది చెబుతూ ఉంటారు. ఇక అందులో రాజు కూడా ఒకరు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నైజాం ఏరియాలో ఆయన కనుసైగలతో సినిమాలు ప్రదర్శించపడుతూ ఉంటాయి. అందుకే దిల్ రాజు మీద ఏ హీరో కూడా అంత ఈజీగా రియాక్ట్ కాదు. ఇక ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏకంగా సై అంటుంది. ఒక విధంగా ఆయన గతంలో చెప్పిన మాటలను హైలైట్ చేసింది. 

దిల్ రాజు గతంలోనే.. పండగలకు డైరెక్ట్ తెలుగు సినిమాలు ఉండగా డబ్బింగ్ సినిమాలకు థియేటర్స్ ఎందుకు ఇస్తాము అని కామెంట్ చేశారు. అయితే అదే విషయాన్ని ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ హైలెట్ చేస్తూ వచ్చే సంక్రాంతికి కూడా తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా థియేటర్లో కేటాయించాలి అని ఎగ్జిబిటర్స్ ను కోరింది. ఒక విధంగా దిల్ రాజు చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆయనకు మేకులుగా మారాయి. 

ఆ మధ్య నిర్మాతల అందరూ కూడా స్ట్రైక్ చేసినప్పుడు తెలుగు సినిమాల షూటింగ్ ఆగినా కానీ వారసుడు సినిమా తెలుగు సినిమా కాదు అని డబ్బింగ్ సినిమా అంటూ షూటింగ్ అలానే కొనసాగించారు. ఇక ఆ ప్రభావం ఇప్పుడు చూపించే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు దిల్ రాజు మీద ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈ విధంగా సెటైర్ వేసినట్లుగా రెచ్చగొట్టడం చూస్తూ ఉంటే ఆయన టైం చూసుకుని కౌంటర్ ఇవ్వక మానరు అని చెప్పవచ్చు.

వచ్చే సంక్రాంతికి వాల్తేరు వీరయ్య - వీర సింహారెడ్డి సినిమాలు విడుదలవుతున్నాయి. రెండు పెద్ద సినిమాలు కాబట్టి థియేటర్ల ఆధిపత్యం గట్టిగానే ఉంటుంది. ఇక దిల్ రాజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా థియేటర్లు తన ఆధీనంలోనే ఉంచుకున్నాడు. వాటికి ప్రతి ఏడాది అద్దె కట్టుకుంటూ తన ఆధీనంలోనే ఉంచుకున్నాడు. ఒక విధంగా అది వ్యాపారమే.

ఇక ఇప్పుడు వారసుడు సినిమాకు వచ్చేసరికి ఎగ్జిబిటర్స్ తరహా రిలీజ్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడే అవకాశం లేకపోలేదు. కాకపోతే దిల్ రాజు దాదాపు అందరూ ఎగ్జిబిటర్లతో మంచి రిలేషన్ ఉంది కాబట్టి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ను బురిడీ కొట్టించి మరి తన సినిమాను విడుదల చేసుకునే సత్తా కూడా ఉంది. ఎలాగో ఏషియన్ సినిమాస్ కూడా రాజుగారికి సన్నిహితంగానే ఉంటారు. వారసుడికి కాస్త ఎక్కువ థియేటర్స్ దొరికినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు అనవసరంగా తనను టార్గెట్ చేస్తున్నారు అని దిల్ రాజు భవిష్యత్తులో కౌంటర్ ఇవ్వకపోడు అనే టాక్ కూడా వస్తోంది.

Post a Comment

Previous Post Next Post