వారసుడికి 90 కోట్లతో దిల్ రాజు కండిషన్


టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు మొదటిసారి కాలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో వారసుడు అనే సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కమర్షియల్ దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు తమిళంలో అయితే మంచి హైప్ క్రియేట్ చేసుకుంటుంది. కానీ ఇప్పటివరకు తెలుగులోనే పెద్దగా హడావిడి క్రియేట్ కాలేదు. ఇక నిర్మాత దిల్ రాజు చిత్రానికి గాను విజయ్ కి దాదాపు 90 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు ఒక టాక్ అయితే ఉంది.


అయితే విజయ్ స్టార్ హీరోగా రేంజ్ పెరిగిన తరువాత తమిళనాడులోనే అతను ప్రమోషన్స్ లో పెద్దగా పాల్గొన్న సందర్భాలు చాలా తక్కువ. కానీ ఈసారి తప్పనిసరిగా తెలుగులో అయితే ప్రమోషన్ చేయాల్సిందే అని దిల్ రాజు ముందుగానే కండిషన్ పెట్టినట్లు సమాచారం. తెలుగులో మీ మార్కెట్కు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది తప్పకుండా చేయాల్సిన బాధ్యత అని రెమ్యునరేషన్ ఇచ్చినప్పుడే కండిషన్ పెట్టినట్లుగా తెలుస్తోంది. మరి దిల్ రాజు కోరిక మేరకు విజయ్ వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటాడో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post